కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మూసాపేట మండల పరిధిలోని మౌలాలిగుట్ట (Moulali Gutta)లో గత నెల మూడో తేదీన షేక్ పాషా అనే వ్యక్తి 50 ట్రిప్పుల మొరాన్ని అక్రమంగా తరలించారంటూ అబ్దుల్ ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు గత నెల ఆరో తేదీన ఫిర్యాదు చేశారు. అబ్దుల్ ఖాదర్ ఫిర్యాదుపై శనివారం జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, మూసాపేట తహసీల్దార్ కార్యాలయ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో జిల్లా మైనింగ్ శాఖ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి, సర్వేయర్ సుజాత, ఆర్ఐ రవి తదితరులు పాల్గొన్నారు.

