మొక్కజొన్న రైతులు తిప్పలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్లు ఉంటుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆయన చిన్నకోడూరు మండలం గంగాపూర్లో మొక్కజొన్న రైతులతో హరీష్ రావు ముచ్చటించారు. వారి సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం రేవంత్ రెడ్డి మమ్మల్ని తిప్పలు పెట్టాడని, అందరిని ఆగం చేశాడని, సన్న బియ్యంతో అన్నం ముద్ద అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం రంగనాయక సాగర్ నిర్మించక నీళ్ల ఇబ్బందులు పోయాయని.. రెండు పంటలు కాదు మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్ళే అంటూ చెప్పారు అన్నదాతలు.
Read Also: ఎన్నికల్లో పోటీకి వయోపరిమితి తగ్గింపు అవసరం: రేవంత్

