నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్‌ను అరెస్ట్ చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టే బుల్ ప్రమోద్(Constable Pramod) అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సోమవారం.. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుప్రత్రిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రౌడీషీటర్ రియాజ్ మరణించాడు. కాగా, తాజాగా ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. కానిస్టేబుల్ ప్రమోద్‌కు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ‘‘పోలీసులు అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా.. విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ అంశాన్ని ప్రస్తావించారు.
‘‘దేశం కోసం ఎందరో పోలీసులు ప్రాణ త్యాగాలు చేశారు. నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్(Constable Pramod) కూడా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందిస్తుంది. దానితో పాటు ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తున్నాం’’ అని ప్రకటించారు.
Read Also: రాజ్‌గోపాల్ రెడ్డి, జూపల్లి మద్య మద్యం మంటలు చెలరేగనున్నాయా..!

