epaper
Tuesday, November 18, 2025
epaper

రాజ్‌గోపాల్ రెడ్డి, జూపల్లి మద్య మద్యం మంటలు చెలరేగనున్నాయా..!

మంత్రి జూపల్లి కృష్ణారావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Raj Gopal Reddy) మధ్య మద్యం మంటలు చెలరేగనున్నాయా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్‌లకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మునుగోడు(Munugode) ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. తన నియోజకవర్గంలో మద్యం దుకాణాలు పెట్టాలనుకునేవారికి పలు కీలక సూచనలు చేశారు. సాయంత్రం వేళల్లోనే మద్యం దుకాణాలు తెరవాలని, దుకాణాలు ఊరి బయట ఉండాలని సూచించారు. అంతేకాకుండా పక్క జిల్లాల వారు ఎవరూ కూడా తమ నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు టెండర్ల వేయొద్దని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తాజాగా మునుగోడులో మద్యం దుకాణాలకు టెండర్ వేయాలనుకునే వారంతా.. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)ను వెళ్లి కలిశారు.

ఆయన సమక్షంలో టెండర్లు వేయడానికి మద్యం వ్యాపారులు రెడీ అయ్యారు. ఈ అంశమే ఇద్దరు నేతల మధ్య చిచ్చుకు కారణమైంది. రాజగోపాల్ సూచనలు, కండిషన్స్‌పై మంత్రి జూపల్లి స్పందిస్తూ.. రాష్ట్రమంతా ఒకే రూల్ ఉంటుందని, ఒక్కో నియోజకర్గాన్ని ఒక్కో నిబంధన ఉండదన అన్నారు. నియమ నిబంధనలను అందరూ అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి.

అయితే అన్ని నియోజకవర్గాల తరహాలో తన నియోజకవర్గంలో నడవదని, తాను ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్య ఇస్తానంటూ గతంలోనే రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి, రాజ‌గోపాల్(Raj Gopal Reddy) మధ్య మద్యం మంటలు చెలరేగాయని, ఇప్పటికే రాజగోపాల్ వ్యవహారంపై జూపల్లి.. పార్టీ అధిష్టానానికి నివేదిక కూడా పంపారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ విషయం ఎంత వరకువెళ్తుందో చూడాలి.

Read Also: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈరోజే ఆఖరు..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>