Mobile Popup Ad
Mobile Popup Ad

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారు: CM రేవంత్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) సంచలన ఆరోపణలు చేశారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన భారతరత్న అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. 50 శాతం ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచుతామని దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ చిన్న లెక్క కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళకి తెలియడం లేదా? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యక్తిరేకం కాదని స్పష్టం చేశారు. మంచి పనికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజలదని.. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ప్రజలదేనన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని సీఎం రేవంత్ (CM Revanth Reddy) స్పష్టం చేశారు. కులాల అంతరం తొలగిపోవాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని అన్నారు. పేదలకు విద్య అందాలన్న అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. నాణ్యమైన విద్య అందించాలన్న ఆశయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకొస్తున్నామని వివరించారు. రెండేళ్లల్లో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని.. ఇందులో ఎక్కువ దళితులు, గిరిజనులకు ఇచ్చింది వాస్తవం కాదా! ప్రజలే ఆలోచించాలని సూచించారు. 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు.

Read Also:  డీలిమిటేషన్‌పై కేంద్రానికి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>