భూ వివాదాలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నానన్ని చెప్పారు. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో గురువారం ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాస్ బుక్ పుస్తకాలు ఇచ్చినప్పుడు రైతుల ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.

ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశామని సీఎం ప్రకటించారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తామని.. వారికి భద్రత, భరోసాను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>