బంప‌ర్ ఆఫ‌ర్‌ కొట్టేసిన సంయుక్త మీన‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: సార్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి విరూపాక్షతో సూప‌ర్ హిట్ అందుకున్న కేర‌ళ బ్యూటీ సంయుక్త మీన‌న్ (Samyuktha Menon) తెలుగులో మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. చాక్లెట్ బోయ్ రామ్ పోతినేని (Ram Pothineni) స్వీయ కథ, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #RAPO23లో హీరోయిన్‌గా సంయుక్త నటించనుంది. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా సంయుక్త కనిపించనుంది. మూవీ టీం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ పోతినేని డైరెక్ష‌న్‌తో కొత్త ప్రయత్నంగా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మూవీ యూనిట్ తెలిపింది. RAPO23 షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Read Also: రష్మిక మందన్న భారీ సాహసం.. ఇండియన్ సినీ చరిత్రలోనే!

Read Also: డిజిటల్ వారసులు 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>