కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లోపాయికారి ఒప్పందం: అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: మాజీ మంత్రి జీవన్ రెడ్డి‌కి మంత్రి అడ్లూరి (Adluri)  లక్ష్మణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జీవన్ రెడ్డి ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని.. ఆ ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారని అడ్లూరి మండిపడ్డారు. రెండేండ్లలోనే ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి మార్పు కోరుకుంుటన్నారని జీవన్ రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. గురువారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘానబట్ల దినేశ్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో కలిసి అడ్లూరి మీడియాతో మాట్లాడారు. జీవన్‌రెడ్డిని ఎంతో గౌరవించుకున్నామని సీనియర్ నేతగా ఆయనకు తగిన గౌరవం ఇచ్చామన్నారు. అయినప్పటికీ పార్టీ మారడం కరెక్ట్ కాదన్నారు. ‘రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రూ. 500లకే సిలిండర్ ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటారు?‘ అంటూ అడ్లూరి ప్రశ్నించారు.  బీఆర్‌ఎస్ పార్టీపై జీవన్ రెడ్డి చేసినన్ని విమర్శలు ఎవరు చేయలేదని, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

కలలుకంటున్న కేటీఆర్

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ కలలు కంటున్నారని అడ్లూరి పేర్కొన్నారు. కేటీఆర్ తలకిందుల తపస్సు చేసినా ముఖ్యమంత్రి కాలేరని పేర్కొన్నారు. కేటీఆర్ సీఎం కావాలనుకున్నా హరీశ్ రావు అడ్డం పడతాడన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అడ్లూరి స్పష్టం చేశారు. కేసీఆర్ కు దీటైన నాయకుడు రేవంత్ రెడ్డి అని భావించి కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిని చేస్తే ఆయన కష్టపడి అధికారంలోకి తీసుకువచ్చారాని గుర్తు చేశారు. అప్పుల కూభిలో కురుకుపోయినా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రజలకుచ్చిన 6 గ్యారంటీలను అమలుచేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుడిని చేయగలరా? దళితుడిని ముఖ్యమంత్రి చేయగలరా? అంటూ ప్రశ్నించారు. ఏఐసీసీ నేతలు వెళ్లి నచ్చజేప్పలేదని జీవన్ రెడ్డి పై ఉన్న గౌరవంతో ఇంటికి వెళ్లారని తెలిపారు. రేవంత్‌ను ఓడిస్తానంటూ జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి చెప్పారు. సామాన్య కార్యకర్తలకు కూడ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని దానికి నిదర్శనం నేనేనని పేర్కొన్నారు.

మాది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమే

తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం‌తో కలిసి పనిచేస్తూ నిధులు తీసుకొస్తున్నానని చెప్పారు. యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడానికి హామీ ఇచ్చారనీ పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని జీవన్ రెడ్డి మాట్లాడడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి వివిద రకాల పదవులు అనుభవించారని, గుర్తింపు ఇవ్వలేదనడం, అగౌర పరిచరానడం సరికాదన్నారు. 40 ఏండ్లు జీవన్ రెడ్డి వెంట నడిచామని కానీ ఆయన పార్టీ మారడాన్ని వ్యతిరేకిస్తున్నామని నందయ్య పేర్కొన్నారు. సమావేశంలో జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు దుమల రాజ్ కుమార్, నవీన్, లక్ష్మీనారాయణ, కొత్త మోహన్, బాల ముకుందం, గట్టు సతీశ్, చిలుముల లక్ష్మణ్, బండ శంకర్, పిప్పరి అనిత, బింగి రవి కుసరి అనిల్, మనపురి మహేశ్, మున్నా, శరత్ రావు, నాగయ్య, రవీందర్ రావు, కోలుగురి దామోదర్ రావు, మహేశ్వర్ రావు, బోగోజీ ముఖేష్ ఖన్నా, సత్యనారాయణ, సంగ నర్సిములు, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>