Mobile Popup Ad
Mobile Popup Ad

రష్మిక మందన్న భారీ సాహసం.. ఇండియన్ సినీ చరిత్రలోనే!

కలం, వెబ్ డెస్క్: రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒకవైపు కమర్షియల్ సినిమా చేస్తూనే.. మరోవైపు కథా బలమున్న పాత్రలతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటేడ్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దూసుకుపోతోంది ఈ బ్యూటీ. క్యారెక్టర్ తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడం రష్మిక ప్రత్యేకత. ఈ నేపథ్యంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించింది. మైసా టీమ్ ప్రతిష్టాత్మకంగా ఒక అండర్‌వాటర్ ఫైట్ సీన్ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసింది.

భారతీయ సినీ చరిత్రలోనే ఒక మహిళా ప్రధాన పాత్రతో ఇలాంటి సాహసోపేతమైన నీటి అడుగున యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో రష్మిక మందన్న డూప్ లేకుండా ధైర్యసాహసాలతో, ప్రాణాలను పణంగా పెట్టి నటించింది. ఎంతో సవాలుతో కూడుకున్న ఈ అండర్‌వాటర్ ఫైట్ సీన్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. రష్మిక కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>