Mobile Popup Ad
Mobile Popup Ad

విజ‌య్ జ‌న నాయ‌గ‌న్ రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ (CM Vijay) హీరోగా న‌టించిన చివ‌రి సినిమా జ‌న నాయ‌గ‌న్ (Jana Nayagan) విడుద‌ల‌కు అడ్డంకులు తొల‌గిపోయాయి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. విజ‌య్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ముందు జ‌న నాయ‌గ‌న్ త‌న చివ‌రి సినిమా అని, ఇక‌పై సినిమాల్లో న‌టించ‌బోన‌ని ప్ర‌క‌టించారు. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా కోసం ఎన్నిక‌ల ముందు విజ‌య్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌తో ఎదురు చూశారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల సినిమా విడుద‌ల కాలేదు.

సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిన జ‌న నాయ‌గ‌న్‌ ఎట్టకేలకు జూలై 24న‌ విడుదల కానుంది. ఈ విష‌యాన్ని మూవీ టీం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్‌ అందించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించి, ఆయ‌న‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా, చివ‌రి చిత్రం ఇదే కావడం విశేషం.

మూడు దశాబ్దాలకు పైగా సాగిన విజయ్ సినీ కెరీర్‌లో ఇదే ఆఖరి సినిమా కావడంతో జన నాయగన్ విజ‌య్ ఫ్యాన్స్‌కి ఎమోష‌న‌ల్ మెమొరీగా ఉండిపోనుంది. అంతే కాకుండా కోలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించే బ్లాక్ బాస్ట‌ర్ మూవీగా రికార్డులు సృష్టించడం ఖాయ‌మ‌ని మూవీ క్రిటిక్స్ భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>