Mobile Popup Ad
Mobile Popup Ad

26.8 కిలోల ఎండు గంజాయి సీజ్

కలం, ఖమ్మం బ్యూరో :  ఖమ్మం (Khammam) జిల్లా సరిహద్దులో  26.8 కిలోల ఎండు గంజాయిని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన భారీ ఆపరేషన్ లో భాగంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ అయ్యారు. వీరు భద్రాచలం నుంచి హైద్రాబాద్ కు గంజాయిని తరలిస్తుండగా మార్గం మద్యలో డోర్నకల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ.13.41 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి తో పాటు రవాణాకు ఉపయోగించిన ఎర్టిగా కారు, పల్సర్ మోటార్ సైకిల్, ప్యాకింగ్ మెటీరియల్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని డోర్నకల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.నిందితులు చంద్రశేఖర్, విజయ్ కాంత్,వినోద్, శశికాంత్ లు ఒడిశాకు చెందిన కొప్పు రాజు అనే వ్యక్తి దగ్గర కిలో రూ. 3 వేల చొప్పున, మొత్తం రూ.78 వేలు చెల్లించి 26.89 కిలోల గంజాయిని కొనుగోలు చేయడం జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా, ఈ కేసులో మరో నిందితుడు వాస్కల రాజు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>