అణుశక్తి రంగంలో దూసుకుపోతున్న భారత్: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అణుశక్తి రంగంలో దూసుకుపోతుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యాఖ్యానించారు. దేశ అణుశక్తి ప్రయాణంలో కీలక ముందడుగు పడటం గర్వకారణమని పేర్కొన్నారు. స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించిందని తెలిపారు. దేశ అణు కార్యక్రమంలో రెండో దశకు ముఖ్యమైన మైలురాయి సాధించామని కొనియాడారు. ఈ మేరకు అణుశక్తి రంగంపై కృషి చేసిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు అణుశక్తి వినియోగాలను చూపించడానికి శాస్త్రవేత్తలతో కలిసి ప్రత్యేక వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కల్పక్కం ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం, వైద్యం, అంతరిక్షం, రక్షణ రంగాల్లో అణుశక్తి వినియోగంపై విద్యార్థులు అవగాహన కల్పించారు.

Read Also: పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టు పోస్టర్ల కలకలం

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>