epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కర్నూలు ప్రమాదంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

కర్నూలు(Kurnool) జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు(Chandrababu) దృష్టి సారించారు. ప్రమాద స్థలంలో చేపట్టిన చర్యలు, తీసుకుంటున్న చర్యలపై చర్చించడానికి ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇతర రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. మృతుల వివరాలను గుర్తించి కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని ఆయన తెలిపారు. అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనేది దర్యాప్తు చేయాలని, బాధ్యులను చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన(Chandrababu) చెప్పారు.

సరైన చర్యలు తీసుకోండి: పవన్

భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సూచించారు. కర్నూలు ప్రమాదంపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Read Also: కర్నూలులో ఘోర ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>