కర్నూలు(Kurnool) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సిబ్బంది, 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. ఒక డ్రైవర్ పరారవగా మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు. కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో బస్సు ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో బైక్.. బస్సు కిందకి చొచ్చుకువెళ్లింది. బైక్‌లో పెట్రోల్ లీకవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కర్నూలు కలక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాచారం కోసం తమను కాంటాక్ట్ చేయాలని ఫోన్ నెంబర్లు ఇచ్చారు.
కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305
కర్నూలు(Kurnool) ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059
ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు:
9494609814
9052951010
బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు అని కలెక్టర్ సిరి తెలిపారు.
Read Also: కర్నూలులో ఘోరప్రమాదం… 25 మంది మృతి

