Mobile Popup Ad
Mobile Popup Ad

బాన్సువాడలో హనుమాన్ విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌.. వేడుక‌ల్లో పాల్గొన్న పోచారం

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada)లో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పోతంగల్ మండల కేంద్రంలో ఇటీవ‌ల‌ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆల‌యంలో స్వామి వారి విగ్రహ ప్ర‌తిష్టాప‌న‌ మహోత్సవాన్ని నేడు ఘ‌నంగా నిర్వ‌హించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మ‌న్ కాసుల బాలరాజు కూడా హాజరయ్యారు. అనంతరం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సోమేశ్వర్ గ్రామంలో జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహ పునః ప్ర‌తిష్టాప‌న‌, వినాయక, శివలింగం, నందివాహన, ధ్వజస్తంభం, శిఖర స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల, పోతంగల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున వేడుక‌ల్లో పాల్గొన్నారు.

Read Also: ఫ్యూచర్ సిటీ కార్యాలయం త్వరగా పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ ఆదేశం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>