కలం, వెబ్ డెస్క్: ఏపీలో మెగా డీఎస్సీ (Mega DSC)పై వస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. డీఎస్సీ నిర్వహణపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీ పరీక్షలు పారదర్శకంగానే నిర్వహించానమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డీఎస్సీపైనే చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారమే స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వైసీపీ నేతలు చెప్తున్నట్లుగా అక్రమాలు జరిగితే ఆధారాలు బయటపెట్టాలన్నారు. వైసీపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
తెలంగాణలో పవన్ సభపై..
ఇక తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సభకు అనుమతి ఇవ్వకపోవడంపై చంద్రబాబు స్పందించారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడం, అడ్డుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఏపీలో ఒక యూనిట్ పెట్టిందని గుర్తు చేశారు. తాను కూడా ఇటీవల తమిళనాడులో ప్రచారం చేసి వచ్చానని చెప్పారు. ఇలా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. అమెరికాతో ప్రపంచంలో ఎన్నో చోట్ల తెలుగు వాళ్లు పాలనలో భాగస్వామ్యం అవుతున్నారని చెప్పారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టవద్దని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అయ్యిందని, ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసునని చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. దేన్నీ చెడగొట్టకుండా లాజికల్‌గా ముందుకు వెళ్లాలని నాయకులకు సూచించారు.
Read Also: సింపతీ కోసమే పవన్ కళ్యాణ్ హైడ్రామా: పేర్ని నాని
Follow Us On: Sharechat

