వరంగల్ కాంగ్రెస్(Warangal Congress)లో విభేదాలు ఏమాత్రం చల్లారడం లేదు. పార్టీ అధిష్టానం కలుగజేసుకుని సర్దిచెప్పినా.. విభేదాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా నివురుగప్పిన నిప్పులా ఉంటూ ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తాజాగా ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మధ్య ఉన్న విభేదాలు వరంగల్ తూర్పులో చెలరేగాయి. కాశిబుగ్గలోని ఇందిరా గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ(Errabelli Swarna) వేసిన పూలమాలలను కొండా సురేఖ అనుచరులు తొలగించారు.
అనంతరం అక్కడకు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. ఇందిరా గాంధీ విగ్రహానికి తన వెంట తెచ్చిన పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, కొండా సురేఖను చూసిన వెంటనే ఎర్రబెల్లి స్వర్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను వేరువేరుగా నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్‌లో కాంగ్రెస్(Warangal Congress) విభేదాలు మరోసారి పార్టీకి తలనొప్పిగా మారనున్నాయని చర్చలు జరుగుతున్నాయి.
Read Also: మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం..

