మొంథా తుపాను సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy) విమర్శించారు. ముంథా తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని, అందుకు ఫలితంగా ఒక్కరూ చనిపోలేదని అన్నారు. కానీ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలను గాలికి వదిలేసి జూబ్లీహిల్స్ ప్రచారం చేయడంలో నిమగ్నమైందని, ఈ సర్కార్ చేతగానితనం వల్ల రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు.
అంతేకాకుండా ఇంకా చాలా మంది గల్లంతయ్యారని చెప్పారు. ‘‘కాంగ్రెస్ అసమర్థత వల్ల, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ విధ్వంసం ఎక్కువైంది. తుఫాన్ ప్రభావంతో 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. అది ముమ్మాటికీ తప్పు. పంటను అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లగా, అకాల వర్షాలకు పంట తడిచి రైతులు నష్టపోయారు.. వీరందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. మొక్కజొన్న పంటను కొనడానికి ప్రభుత్వం కొర్రీలు పెట్టింది.. దీంతో పంటను అమ్మడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తేమ శాతాన్ని, డ్యామేజ్ ను పరిగణనలోకి తీసుకోకుండా పత్తి, వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం’’ అని ఆయన(Peddi Sudarshan Reddy) తెలిపారు.
Read Also: మాగంటి సునీతపై కేసు నమోదు..

