చిత్తూరు(Chittoor) మాజీ మేయర్ కఠారి దంపతుల హత్యలో పదేళ్ల తర్వాత చిత్తూరు కోర్టు తన తీర్పును వెలువరించింది. ఐదుగురు దోషులకు ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే పదేళ్ల క్రితం కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య రాష్ట్రమంతా సంచలనంగా మారింది. ఈ కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. తొలుత ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. కాగా, వారిలో తనకు కేసు సంబంధం లేదని ఏ22గా ఉన్న కాసరం రమేశ్ పిటిషన్ దాఖలు చేయడంతో.. అతని పేరును తొలగించారు. అదే విధంగా విచారణ జరుగుతుండగానే ఏ21గా ఉన్న శ్రీనివాసాచారి మరణించారు.
దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 21గా ఉంది. వారిలో ప్రధాన నిందితులు ఐదుగురు మినహా మిగిలిన 16 మందిపై హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ఆర్థిక సహాయం అందించారని పోలీసులు అభియోగాలు మోపారు. కాగా విచారణలో అవి రుజువుకాకపోవడంతో వారిని న్యాయస్థానం(Chittoor Court) నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో మిగిలిన ఐదుగురు విషయంలో విచారణ కొనసాగించిన న్యాయస్థానం తాజాగా వారిని దోషులుగా నిర్ధారిస్తూ వారికి ఉరిశిక్ష విధించింది. అయితే ఈ కేసు మొత్తం 352 వాయిదాలు పడింది. ఇందులో 122 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.
Read Also: ఏక్తా దివాస్‌లో పాల్గొన్న చిరంజీవి..

