epaper
Friday, January 23, 2026
spot_img
epaper

మంత్రి సీతక్క పర్యటనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల తోపులాట

కలం, వెబ్ డెస్క్ : జనగామలో మంత్రి సీతక్క శుక్రవారం పర్యటించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ (Congress), బీఆర్ ఎస్ (BRS) నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రి సీతక్క వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అనంతరం పెంబర్తి క్రాస్ వద్ద చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాల ఆవిష్కరణకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టబోతుంటే కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఇది బీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమం కాదంటూ వాదించారు. దీంతో అటు బీఆర్ ఎస్ నేతలు కూడా వాగ్వాదానికి దిగారు. రెండు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరువురిని వారించి చెదరగొట్టారు.

మద్యం తాగి నాపై దాడి చేశారు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ డీసీసీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అతని కొడుకు ప్రశాంత్ రెడ్డి తనపై కుట్ర చేసినట్టు ఆరోపించారు. ‘ప్రతాప్ రెడ్డి అతని అనుచరులకు మద్యం తాగించి కావాలనే నా మీద దాడి చేయించారు. మంత్రి సీతక్క పిలిస్తేనే నేను ఆ ప్రోగ్రామ్ కు వెళ్లాను. అక్కడున్న కాంగ్రెస్ నేతలను కూడా కొబ్బరి కాయ కొట్టాలని కోరాను. మధ్యలో ప్రతాప్ రెడ్డి అనుచరులు మద్యం తాగొచ్చి పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతాప్ రెడ్డి కావాలనే నా మీద ఇప్పటికే పలుమార్లు దాడి చేయించారు. మంత్రి సీతక్కకు మా ప్రభుత్వంలో ఎంతో గౌరవం ఇచ్చాం. ఆ విషయం సీతక్క గుర్తుంచుకోవాలి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతాం’ అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Read Also: విచారణలో రాధాకిషన్ రావు.. కేటీఆర్ క్లారిటీ..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>