హైదరాబాద్​లో పెరుగుతున్న చికెన్ ధరలు.. కారణమిదే!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ సిటీలో చికెన్ ధరలు (Chicken Prices) ఆకాశాన్ని తాకుతున్నాయి. వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రత పెరగడం, దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవడంతో చికెన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణంగా వేసవిలో చికెన్ వినియోగం తగ్గుతుందని భావిస్తారు. కానీ ప్రస్తుతం సిటీలో (Hyderabad) జరుగుతున్న వరుస వివాహ వేడుకల వల్ల మాంసానికి డిమాండ్ పెరిగింది. దీంతో కొద్ది రోజులుగా చికెన్ ధరలు కిలోకు 10 శాతం కంటే ఎక్కువ పెరిగి సామాన్యులకు భారంగా మారాయి.

మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి కొంతమేర తగ్గింది. ఎండల కారణంగా కోళ్ల మరణాల రేటు పెరగడం సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ. 350 నుండి రూ. 370 వరకు ఉండగా, బోన్‌లెస్ చికెన్ ధర రూ. 500 మార్కును దాటేసింది. వర్షాలు కురిసి వాతావరణం చల్లబడే వరకు, సరఫరా పెరిగే వరకు ఈ ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>