కలం, వెబ్ డెస్క్ : మమతా బెనర్జీ (Mamata Banerjee) ని తిరిగి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా నియమించాలని బంగ్లాదేశ్ లో డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. దీదీని తిరిగి సీఎంగా నియమించకపోతే భారత దేశంపై దాడి చేస్తామని ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం సువేందు అధికారికి ఇస్లామిక్ ఆందోళనకారులు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. దీదీ (Mamata Banerjee) కి సపోర్టుగా ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. దీంతో మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ఎంతగా మద్దతు ఇస్తుందో మరోసారి స్పష్టమైంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఓటమిని బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ మైనారిటీల హక్కును కాలరాశారంటూ బంగ్లాదేశ్ ఎంపీ నసీద్ ఇస్లాం సంచలన ప్రకటన చేశారు. దీదీ కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని తమ మద్ధతు కోల్పోలేదని ఆయన వెల్లడించారు. 17 కోట్ల బంగ్లాదేశ్ ముస్లిం ప్రజలు ఆమె వెంట ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మమత బెనర్జీకి మద్దతుగా బంగ్లాదేశ్ ఇస్లామిస్టులు ర్యాలీ తీయడం సంచలనంగా మారింది.

