కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ భూముల రక్షణలో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ (Collector Manu Choudary) మిక్కిలినేని మను చౌదరి వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశించినప్పటికీ విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం పట్ల హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, స్వాధీనం చేసుకునే ప్రక్రియలో కలెక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని స్పష్టం చేస్తూ కోర్టు తప్పుపట్టింది.
ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ను నేరుగా కోర్టు ముందుకు తీసుకొచ్చి హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ప్రభుత్వ భూమిని కాపాడటంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, ఈ అంశంలో కలెక్టర్ తీరును ఆక్షేపించింది.

