కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఏపీ పర్యటన ఆకస్మికంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ రోజు రాత్రి విశాఖ చేరుకుని రేపు సీఐఐ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. అమిత్ షా స్థానంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సీఐఐ సదస్సును (CII Summit) ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు సదస్సు షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు.
వాస్తవానికి అమిత్ షా (Amit Shah) రేపు సాయంత్రం వరకు విశాఖలోనే ఉంటారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే పర్యటన రద్దు చేసుకోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకురావడంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఐఐ సమ్మిట్‌ను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
Also Read :1968లో రాజీవ్‌తో పెళ్లి.. పౌరసత్వంపై 15 ఏళ్ల నిరీక్షణ ఎందుకు? : కంగనా
Follow Us On: X(Twitter)

