సోనియా గాంధీ పుస్తకంపై విమర్శలను పట్టించుకోవద్దు: మహేష్ కుమార్ గౌడ్

కలం, నిజామాబాద్ బ్యూరో : సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంపై (Sonia Gandhis Book) రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ పుస్తకంలో ఎన్నో బాధాకరమైన వాస్తవాలు తన జీవితంలోని విషాదాలను పుస్తకంలో సోనియా గాంధీ వివరించారని చెప్పుకొచ్చారు.

విదేశాల్లో పుట్టినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించిన ఆదర్శ మహిళగా పేర్కొన్నారు. దేశ రాజకీయాలను ఆకళింపు చేసుకుని పార్టీని నడిపిస్తున్న నాయకురాలు అని కితాబిచ్చారు. 2004లో ప్రధాని పదవిని త్యజించిన ఘనత అమెడన్నారు. మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎంపిక చేసిన ఘనత సోనియాదేనని అన్నారు. త్యాగధనుల కుటుంబానికి కోడలిగా ఆమె ప్రస్థానం సాగిందని వివరించారు. ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రతి ఒక్కరూ సోనియా గాంధీ రచించిన పుస్తకాన్ని చదవాలనీ కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>