కలం, వెబ్ డెస్క్ : ఛత్తీస్ గఢ్ లోని సక్తీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సింఘిత రాయ్ లోని పవర్ ప్లాంట్ లో పేలుడు (Power Plant Explosion) సంభవించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై అధికారిక ప్రకటన రావాల్సి వస్తుంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పవర్ ప్లాంట్ లో పేలుడు సంభవించిన సమయంలో కార్మికులందరూ ప్లాంట్ లోపల ఉండి పనిచేస్తున్నారు. ఆకస్మిక పేలుడుతో ప్రాంగణం అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. కార్మికులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయేందుకు పరుగులు తీయడంతో తొక్కిసలాట కూడా జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Read Also: 15 ఏళ్ల పాలనపై ప్రశ్నించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Follow Us On : WhatsApp

