కలం, వరంగల్ బ్యూరో: ఇటీవల మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండాపోతోంది. ఈ క్రమంలో ఓ దివ్యాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన హనుమకొండ (Hanamkonda) జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికను, మల్లారం గ్రామానికి చెందిన యువకుడు గత కొద్దిరోజులుగా వెంబడిస్తున్నాడు. ఇదే క్రమంలో ఓ రాత్రి ఫోన్ చేసి బయటకు పిలిపించి అత్యాచారం చేశాడు. సదరు యువకుడికి మరో ముగ్గురు వ్యక్తులు సహకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలి సోదరుడు ఆ యువకుడిని గుర్తించి దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముల్కనూర్ ఎస్సై రాజు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: డేటింగ్ సమయంలో పార్ట్‌నర్‌ను అడగాల్సిన 6 ప్రశ్నలు!
Follow Us On : WhatsApp

