కలం, వెబ్ డెస్క్ : చెన్నై శివారులోని షోళింగనల్లూర్ లో భారీ అగ్ని ప్రమాదం (Chennai Fire Accident) చోటు చేసుకుంది. టెక్ మహీంద్రా గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ఎగిసిపడిన వేళ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో ఒక్కసారిగా ఆ మంటలు పక్క భవనాల్లోకి వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న ఐటీ కంపెనీలను ఫైర్ సిబ్బంది ఖాళీ చేయిస్తోంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా నల్లటి దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు భారీ ఎత్తున విస్తరించడంతో .. ఫైర్ సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

