తెలంగాణ రియల్ ఎస్టేట్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. “రియల్ ఎస్టేట్ బాగుంది.. కానీ నేను ఆశించినంత స్థాయిలో ఇంకా మెరుగుపడలేదు” అని వ్యాఖ్యానించారు. జే ఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వే టూ న్యూస్ కాన్ క్లేవ్ 2026 లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.  రియల్ ఎస్టేట్ పడిపోయిందనే భావనను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ అధికారిక నివేదికలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. ముఖ్యంగా కాగ్ (CAG) నివేదికలో కూడా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, రంగం స్థిరంగా ఉందని స్పష్టమైందని తెలిపారు.

కొంతమంది నాయకులు తమకు వారసత్వంగా పదవులు వస్తాయని ఆశించి, అవి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. అలాంటి వారు ప్రభుత్వంపై, విధానాలపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఈగల్ ఫోర్స్” (Eagle Force)పై కూడా కొందరు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తగదని సీఎం (CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ సమస్య తీవ్రతను ఆయన ప్రస్తావిస్తూ, చిన్న వయసులో ఉన్న స్కూల్ పిల్లలు కూడా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Read Also: భోజ్‌శాల మసీద్ కాంప్లెక్స్ కాదు.. హిందూ ఆలయమే: మధ్యప్రదేశ్ హైకోర్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>