కలం, కరీంనగర్ బ్యూరో : తమను మోసం చేసిన వ్యాపారి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ (Karimnagar) జిల్లా చెంజర్ల గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. బాధితులు పురుగుల మందు డబ్బాలతో నిందితుడి ఇంటి ముందు బైరాయించి నిరసన తెలిపారు. ఆర్గనైజర్ ఆత్మహత్యకు ముందే సొమ్మును కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించారని రైతులు ఆరోపించారు. తమ ఆస్తులను సీజ్ చేసి న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: నత్తనడకన ‘యంగ్ ఇండియా’ నిర్మాణాలు..
Follow Us On: X(Twitter)

