కలం, వెబ్ డెస్క్ : హాస్టళ్లలో స్టూడెంట్లకు ఏం జరిగినా సస్పెండ్ చేస్తానని కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు(Chandrababu) నాయుడు. బుధవారం అమరావతిలో కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేస్తోందని.. అవన్నీ అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూడాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. కలెక్టర్లు హాస్టళ్లలో నిద్ర చేయాలన్నారు.
కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇంకా రూ.6252 కోట్లు ఖర్చు చేయకుండా మిగిలిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ ఎస్ నిధులను జనవరి 15లోపు కచ్చితంగా వినియోగించాలని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.
Read Also: హిందూ సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలి : స్వామి శ్రీనివాసానంద
Follow Us On: X(Twitter)


