కలం వెబ్ డెస్క్ : పరకామణి చోరీ చిన్నదే అని కొట్టిపారేసిన మాజీ సీఎం వైయస్ జగన్(YS Jagan) తిరుమల వేంకటేశ్వర స్వామికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద(Swami Srinivasananda) డిమాండ్ చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ(YCP) హయాంలో ఆ పార్టీ నేతలంతా హిందూ సమాజాన్ని, దేవుళ్లను అవమానించే విధంగా మాట్లాడారన్నారు. వైసీపీ హయాంలో హిందువుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. జగన్‌ను హైకోర్టు(High Court) మందలించినా మార్పు రాలేదని విమర్శించారు. పరకామణి చోరీతో పాటు వందల కోట్ల అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరుగుతున్నందుకే జగన్ దాన్ని చిన్న దొంగతనంగా సమర్థించుకుంటున్నారని శ్రీనివాసానంద(Srinivasananda) ఆరోపించారు.
Read Also: ఢిల్లీ కాలుష్యంపై ఎన్హెచ్ఏఐకి సుప్రీం నోటీసులు
Follow Us On: Sharechat


