కలం, వెబ్ డెస్క్ : అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇసురుమండలో గ్యాస్ లీక్ సంచలనంగా మారింది. ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ (Gas Leak) కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషయంపై తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మంటలను వెంటనే పూర్తి స్థాయిలోకి అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.
పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ ఇవ్వాలని సూచించారు. నష్టం వివరాలను కూడా అందించాలని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు అసలేం జరిగిందో.. దీనికి గల కారణాలను కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తాము ఘటన గురించి తెలిసినప్పటి నుంచి అక్కడే ఉన్నామని.. మంటలను అదుపులోకి తీసుకొస్తున్నట్టు మంత్రులు వివరించారు. ఈ రోజు ఉదయం నుంచే గ్యాస్ లీక్ అయి మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.

Read Also: సెలబ్రిటీల వల్ల 80 లక్షలు నష్టపోయా !.. విద్యుత్ టవర్ ఎక్కిన వ్యక్తి
Follow Us On: Pinterest


