epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సీనియర్ నటి రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ..

కలం, సినిమా :  ఇటీవల నటి అనసూయ (Anasuya) పేరు బాగా ట్రెండింగ్ అవుతుంది. సీనియర్ నటుడు శివాజీ (Sivaji) ఆడవారి దుస్తులపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన అనసూయ “నా బాడీ నా ఇష్టం” అంటూ ట్వీట్ చేసింది. ఆడవారి దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు చెప్పినా కూడా ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. పలువురు సెలెబ్రెటీలు సైతం ఈ వివాదంపై స్పందించారు. నెటిజెన్స్ సైతం ఈ వివాదంపై అనసూయకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. గతంలో అనసూయ జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలలో ఆమె మాట్లాడిన డబల్ మీనింగ్ డైలాగ్స్ బయటకు తీసి మీరు అప్పుడు అలా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో అనసూయ హీరోయిన్ రాశి (Raasi) గురించి అసభ్యకరంగా మాట్లాడిన వీడియోని బాగా వైరల్ చేసారు.

తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి రాశి స్పందిస్తూ శివాజీ గారు వంద శాతం కరెక్ట్ చెప్పారు. కానీ చెప్పే విధానం తప్పయింది.దానికి ఆయన క్షమాపణలు కూడా చెప్పారు కానీ ఆ విషయాన్ని కొంతమంది మరింత పెద్దది చేస్తున్నారని ఆమె తెలిపారు. గతంలో అనసూయ రాశి గారి ఫలాలు అంటూ వాడిన భాష నన్ను ఇబ్బంది పెట్టింది. లీగల్ గా వెల్దామనుకున్నా అంటూ అనసూయపై రాశి ఫైర్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో అనసూయ రాశికి క్షమాపణలు చెప్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

రాశి గారు నేను మీకు నిజాయితీగా క్షమాపణలు చెప్తున్నాను. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే దయచేసి నా క్షమాపణలు స్వీకరించండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. జనాలు మారుతూ ఉంటారు. మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు.

ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను.  మీరు అర్థం చేసుకుని మీ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చారు.

Anasuya
Anasuya

Read Also: సినిమాల్లోకి వెళ్లాలనుకునే వారికి ఛాన్స్ ఇస్తున్న దీపిక పదుకొణె

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>