కలం, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ దోపిడీకి గురైందని.. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని చామల చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. లోక్‌సభలో కిషన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నదని ఆరోపించారు. లోక్‌సభలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలని కిషన్ రెడ్డి ప్రయత్నించారని చామల మండిపడ్డారు.
బీఆర్ఎస్ స్క్రిప్ట్ చదివిన కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి లోక్ సభలో బీఆర్ఎస్ స్క్రిప్ట్ చదివి వినిపించారని చామల ఆరోపించారు. కిషన్‌రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్, మెట్రోఫేజ్2 కు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురావడం లేదని నిలదీశారు.
Read Also: పటాన్ చెరులో హరీశ్ రావు పొలిటికల్ చిచ్చు..
Follow Us On: X(Twitter)

