కర్ణాటకలో బస్సు బీభత్సం.. రెండేళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు

కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలోని (Karnataka) హావేరిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. హావేరి సెంట్రల్ బస్ స్టాండ్‌లో అతివేగంతో ఆర్టీసీ బస్సు (RTC Bus) ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే బాలుడు చనిపోయాడు. ఈ ప్రమాదంలో బంకాపురానికి చెందిన వాసుదేవ్ (44), హర్ష (6), కావ్యాంజలి (39) అనే మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై హావేరి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా లేక బస్సులో తలెత్తిన సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: చండీగఢ్​​ బీజేపీ ఆఫీసు ఎదుట పేలుడు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>