Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో ఎండలకు ఉపశమనం.. చలివేంద్రం ఏర్పాటు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) నగరంలో ఎండలు మండుతున్న వేళ ప్రజల దాహం తీర్చేందుకు ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టారు. నగరంలోని 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి ఆధ్వర్యంలో చలివేంద్రం (Chalivendram) ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు చల్లని నీరు అందిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ స్టేట్ సెక్రటరీ గోపిడి స్రవంతి రెడ్డి, అలాగే 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్, భక్త హిందూ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇలాంటి సేవ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కల్పే చిరంజీవిని స్రవంతి రెడ్డి అభినందించారు. ఎండాకాలంలో రోడ్లపై ప్రయాణించే ప్రజలు, వాహనదారుల దాహం తీర్చడం ఎంతో గొప్ప సేవ అని పేర్కొన్నారు. వీలైనంత మంది తమ కాలనీల్లో, కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే మరింత మందికి ఉపశమనం కలుగుతుందని ఆమె సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>