Mobile Popup Ad
Mobile Popup Ad

చిగురుమామిడిలో విషాదం.. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లి (LambadiPalli) గ్రామంలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలం నుండి వడ్ల లోడుతో వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాటం కిషన్ రెడ్డి (28) తన ట్రాక్టర్‌పై పొలం నుండి వడ్లను అన్‌లోడ్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వడ్లు జారబోస్తున్న సమయంలో ట్రాక్టర్ అకస్మాత్తుగా పల్టీ కొట్టడంతో కిషన్ రెడ్డి దాని కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. యువకుడి మరణంతో లంబాడిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>