పెద్దపల్లి ఎమ్మెల్యేకు రాష్ట్ర మంత్రి హోదా

కలం, పెద్దపల్లి: ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే(Peddapalli MLA) చింతకుంట విజయరమణరావుకు(Vijaya Ramana Rao) తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ.ఆర్‌.టి. నెం.1064 ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రభుత్వ విప్‌లుగా కొనసాగుతున్న చింతకుంట విజయరమణరావుతో పాటు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలకు కూడా రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్టేట్ వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్‌లోని ఆర్టికల్–18 ప్రకారం రాష్ట్ర మంత్రులకు వర్తించే అధికారిక ప్రోటోకాల్‌లు, మర్యాదలు వీరికి వర్తించనున్నాయి. శాసనసభలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్‌గా విజయరమణరావు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ హోదా కల్పించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. విజయరమణరావుకు రాష్ట్ర మంత్రి హోదా రావడంపై పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి గౌరవం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>