కలం, వెబ్ డెస్క్: బంగారం (Gold) దిగుమతులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నూతన ‘గోల్డ్ మానిటైజేషన్ పాలసీ’ తెస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా, ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వడ్డీ పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు విధి విధానాలు రూపుదిద్దుకుంటున్నాయి. బంగారం, వెండి ఆభరణాలపై దిగుమతి సుంకాన్ని 5 నుంచి పది శాతానికి ఇప్పటికే పెంచేసిన కేంద్రం.. ఇక ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని పెట్టుబడుల రూపంలోకి మళ్లించే పథకానికి శ్రీకారం చుట్టింది.
ఏటేటా పెరుగుతున్న బంగారం దిగుమతులు..
ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతి పెద్ద బంగారం (Gold) వినియోగం దేశంగా భారత్ నిలుస్తోంది. మన దేశంలో బంగారు ఆభరణాలను అలంకరణల కోసమే ఎక్కువ మొత్తంలో కొంటున్నారు. దీంతో, ప్రజల వద్ద భారీగా నిల్వలు పేరుకుపోతున్నా.. దాని వలన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా.. కొనడం మాత్రం ఆగడం లేదు. 2025-26లో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు 71.98 మిలియన్ డాలర్లకు చేరినట్లు మార్కెట్ వర్గాల అంచనా. దిగుమతులను తగ్గించి, ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా కొత్త పథకాలకు రూపకల్పన చేస్తోంది.
Read Also: ప్రచారానికి కోట్లు పెడతారు.. పెన్షన్లకు లేవా?.. మోదీపై ఖర్గే ఆగ్రహం
Follow Us On : WhatsApp

