సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల (CBSE Results)  కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల ఎదురుచూపులకు తెరపడింది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది మొత్తం 85.20 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలికలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గత రికార్డులను తిరగరాస్తూ 88.86 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.13 శాతానికే పరిమితమైంది. అయితే ఈ సంవత్సరం పరీక్షలలో గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఉత్తీర్ణత శాతం తగ్గింది. గత ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది.

కాగా, ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన results.cbse.nic.in తో పాటు, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన డిజిలాకర్, ఉమాంగ్ యాప్‌ల ద్వారా కూడా మార్క్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదిలాఉంటే విద్యార్థులపై అనవసర ఒత్తిడిని తగ్గించేందుకు ఈసారి కూడా టాపర్ల జాబితాను అధికారికంగా ప్రకటించకూడదని బోర్డు నిర్ణయించింది.

Read Also: ఒకప్పుడు టాప్ మావోయిస్ట్.. ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>