వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇక ఫ్యూచర్ కాదు.. రియాలిటీ: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇక ఫ్యూచర్ కాదు.. అది ఇప్పుడు రియాలిటీ అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం కోసం పని చేసే రోజులు ఇంకా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ద్వారా యువతకు డబ్బు సంపాదించే అవకాశాలు మరింత మెరుగవుతాయని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఆసుపత్రికి బుధవారం సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతి రాజధానిలో ఇదో వినూత్న ప్రయోగమని అభివర్ణించారు. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా 23 ఎకరాల్లో కాలేజీ, 2 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటవుతోందని వివరించారు. మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్ష మందికి నైపుణ్యం అందించనున్నట్లు తెలిపారు. 2027 ఇదే రోజుకు బొల్లినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

దేశంలో ఏకైక నగరంగా అమరావతి..

రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో కూడా ఖర్చులు తగ్గించే దిశగా కీలక మార్పులు తీసుకొస్తామని సీఎం వ్యాఖ్యానించారు. ఐటీ, డిజిటల్ విప్లవంలో సరికొత్త మార్పులు రాబోతున్నాయని వెల్లడించారు. కాన్వాయ్ అంటే పది వాహనాలు వెనక రావడం ఫ్యాషన్ అయిపోయిందని.. సెక్యూరిటీకి నిజంగా అవసరమైనంత మాత్రమే ఉండాలని చెప్పారు. అలాంటివి తగ్గించే సమయం వచ్చిందన్నారు. 190 కిలోమీటర్లతో హైదరాబాద్ ఓఆర్ఆర్ తో అమరావతి భారతదేశంలో ఏకైక నగరంగా నిలవబోతోందని అభిప్రాయపడ్డారు. తమకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిందని చెప్పారు. తాను మామూలుగా అవార్డులు ఒప్పుకునే వాడిని కాదని.. కానీ ఈ పేరు వల్ల ఇంకో పదిమంది వచ్చి పెట్టుబడులు పెడతారంటే అందుకే ఒప్పుకున్నానని చెప్పారు.

ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి..

రాష్ట్రానికి ఇప్పటికే వచ్చిన వాటికంటే ఇంకా ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెప్పారు. క్వాంటమ్ (Quantum) కంప్యూటర్లను బయట నుంచి తీసుకురావడం కాదని.. అమరావతిలోనే తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 153 క్యూబిట్స్ సామర్థ్యంతో నమూనా సిద్ధం చేశామని.. 5 ప్రోటోటైప్స్ తయారయ్యాయని వెల్లడించారు. 5 నుంచి 50 వరకు స్కేల్ చేసే దశలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటింగ్‌లో రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి హబ్‌గా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. గుంటూరు, మంగళగిరి, తెనాలి, అమరావతి.. ఈ నాలుగు ప్రాంతాలను అభివృద్ధి చేసి మధ్యలో ఉన్న గ్యాప్‌లను ఫిల్ చేస్తే గుంటూరు జిల్లా దేశంలోనే బెస్ట్ జిల్లాల్లో ఒకటిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లు ప్లాన్ చేస్తున్నామని వివరించారు. అమరావతి రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి సాధించిందని అభివర్ణించారు. అమరావతి అభివృద్ధికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: అమెరికా పేరు మార్చాలంటున్న ఆర్జీవీ.. కొత్త పేరు సూచ‌న‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>