నిజామాబాద్‌లో జోరుగా ప్రలోభాల పర్వం

కలం, నిజామాబాద్ బ్యూరో: మున్సిపోల్స్ (Municipal Elections) ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. తెల్లవారితే పోలింగ్.. దీంతో ఏ అవకాశాన్ని కూడా అభ్యర్థులు వదులుకోవడం లేదు. నిజామాబాద్(Nizamabad) కార్పొరేషన్‌లో ప్రలోభాల పర్వం పీక్స్‌కు చేరుకుంది. నిజామాబాద్‌లో 60 డివిజన్‌లు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నడుస్తోంది. ఎంఐఎం(MIM) కింగ్ మేకర్ కానుంది. బీఆర్ఎస్ (BRS) సైతం కీలక పాత్ర పోషించాలని భావిస్తుంది. ఆ మేరకు చక్రం తిప్పుతోంది. అన్ని పార్టీలు ఈసారి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అయితే పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. సైలెంట్ పాలిటిక్స్‌కు తెర లేచింది. కొన్ని డివిజన్‌లలో ఓటుకు వెయ్యి రూపాయిలు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో ఆ ధర మరింతగా పెరిగి ఇంకా ఎక్కువ కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఏకంగా ఓసారి ప్రాక్టికల్‌గా వెయ్యి ఆపై ప్రత్యర్థులు ఇచ్చే డబ్బులను బట్టి మరిన్ని ఇంకో దఫా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి సంఖ్య మూడు వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. ఇక మద్యానికి అయితే  లెక్కే లేదు. ఓటర్లను ప్రాంతాల్ని బట్టి ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్, క్వార్టర్ బాటిల్ లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఫుల్ బాటిల్ అందులోనూ కొన్ని ప్రాంతాల్లో కాస్ట్ లీ బాటిల్‌లు కూడా ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు కుల సంఘాలకు డబ్బులు మద్యం బాటిళ్లు అందిస్తూ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.

Read Also: ఆంథ్రోపిక్​ కీలక ఉద్యోగి రాజీనామా.. టెక్ వరల్డ్​లో కలకలం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>