Mobile Popup Ad
Mobile Popup Ad

ఆటోకు డబ్బుల్లేవు.. బైక్‌పైనే అంతిమ ప్రయాణం

కలం, వెబ్​ డెస్క్​ : బాపట్ల జిల్లా (Bapatla) లో ఒక విషాద ఘటన చోటు చేసుకున్నది. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం మరో సవాలుగా మారింది. ఆసుపత్రిలో మృతదేహాలను తరలించే మహా ప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడంతో, వారు ప్రైవేటు ఆటోను ఆశ్రయించారు. స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో డ్రైవర్ రెండు వేల రూపాయలు డిమాండ్ చేయగా, అంత నగదు చెల్లించే శక్తి లేక ఆ సోదరులు నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. వేరే దారి లేక సోదరుడి మృతదేహాన్ని బైక్ పై కూర్చోబెట్టుకుని 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారు.

Bapatla
Bapatla

Read Also: ఏఐ కంటెంట్‌కు లేబుల్.. కేంద్రం ఆంక్షలు..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>