epaper
Tuesday, November 18, 2025
epaper

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ.. హైకోర్టులో పిటిషన్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం పాలసి(Liquor Policy) తెచ్చింది. మద్యం దుకాణం లైసెన్స్‌కోసం చేసుకునే దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచింది. ఇటీవల ఈ కొత్త ధరలతోనే దరఖాస్తులకు పిలుపు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కొత్త పాలసీపై అనిల్ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త ధరలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. లాటరీలో షాపు దక్కకపోతే కట్టిన రూ.3 లక్షలు వెనక్కి రావని, అవి అబ్కారీ శాఖ(Excise Department)కే వెళ్తాయని వివరించారు. అలా కాకుండా లాటరీలో షాపు రాకుండా దరఖాస్తు రుసుము తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లిక్కర్ పాలసీ(Liquor Policy)పై జారీ చేసిన జీఓను కొట్టివేయాలని కోరారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం అబ్కారీ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read Also: ఏముందని ఫిర్యాదు చేస్తారు: పొంగులేటి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>