నకిలీ మద్యం వ్యవహారంలో ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు(Liquor Case)లో సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టడం కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సిట్ అధిపతిగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్‌ను నియమించింది. సిట్ సభ్యులుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ్, సీఐడీ ఎస్పీ కే చక్రవర్తి, పోలీసు సాంకేతి విభాగం ఎస్పీ మలికా గర్డ్ ఉండనున్నారు. నకిలీ మద్యం కేసుపై ఎక్సైజ్ పోలీసులు ప్రాథమి దర్యాప్తు చేసి నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నేపథ్యంలోనే మద్యం అక్రమ తయారీ, సరఫరా, పంపిణీపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ దర్యాప్తులో ప్రతి 15 రోజులకు ఒకసారి పురోగతి నివేదిక అందించాలని ప్రభుత్వం వెల్లడించింది.
ములకలచెరవులో బయటపడ్డ నకిలీ మద్యం తయారీ కేంద్రం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ అంశంపై కూటమి పార్టీలు, వైసీపీ మధ్య ఘాటైన మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నకిలీ మద్యం అంశంలో కొందరు టీడీపీ నేతలు ఉన్నారన్న అంశం వైసీపీ పదే పదే ఎత్తి చూపుతోంది. అయితే వారిని సస్పెండ్ చేశామని, చట్టప్రకారం చర్యలు ఉంటాయని కూటమి ప్రభుత్వం చెప్తోంది. అంతేకాకుండా అసలు రాష్ట్రంలో నకిలీ మద్యానికి బీజం వేసిందే మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు ఇందులోకి సిట్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు(Liquor Case) ఇంకెన్ని మలుపులు తిరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: ఆధారలన్నీ త్వరలోనే విడుదల చేస్తా: కోట వినుత

