కలం, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అల్కరాజ్ (Carlos Alcaraz) అదరగొట్టాడు. అనారోగ్యం వెనక్కి లాగుతున్నా.. రెండు సెట్లు కోల్పోయినా వెనకడుగు వేయలేదు. ఐదు గంటల 27నిమిషాల పాటు సాగిన మారథాన్ పోరులో ఆఖరి సెట్లో గెలుపందుకొని ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం మెల్బోర్న్లో హోరాహోరీగా జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 6–4, 7–6, 6–7, 7–6, 7–5తో జ్వెరెవ్(జర్మనీ)ను ఓడించాడు.
నువ్వా నేనా?
భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఐదు గంటల 29 నిమిషాల పాటు సాగిన అల్కరాజ్, సినర్ మధ్య జరిగిన మారథాన్ మ్యాచ్‌ను తలపించేలా ఈ పోరు సాగింది.
ముందురోజు అనారోగ్యం కారణంగా ఆట మధ్యలోనే వాంతి చేసుకున్న అల్కరాజ్కు సెమీస్‌లో శరీరం సహకరించకున్నా, ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మొదటి సెట్‌ను అలవోకగా గెల్చుకున్నాడు. రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ పైచేయి సాధించాడు. అయితే, ఆ తర్వాత ప్రత్యర్థి బలంగా పుంజుకున్నాడు. మూడు, నాలుగు సెట్లను సొంతం చేసుకున్నాడు. దీంతో ఐదో సెట్ అనివార్యమైంది. ఈ క్రమంలో పాయింట్ పాయింట్‌కు ఇద్దరూ చెమటోడ్చారు. అయితే, పట్టువీడని అల్కరాజ్ ఐదో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొని ఫైనల్‌కు చేరాడు. తుది పోరులో గెలిస్తే ఏడవ గ్రాండ్‌స్లామ్ అల్కరాజ్ (Carlos Alcaraz) సొంతమవుతుంది.
సెమీస్ మ్యాచ్‌లో 12 ఏస్‌లు కొట్టిన అల్కరాజ్, 5 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. జ్వెరెవ్ 17 ఏస్‌లు కొట్టి, 4 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. అయితే, బ్రేక్ పాయింట్ల విషయంలో వెనకబడిన మ్యాచ్‌ను చేజార్చుకున్నప్పటికీ జ్వెరెవ్ పోరాటం ఆకట్టుకుంది.
Read Also: కోహ్లీ ఇన్‌స్టా రీస్టోర్ అయింది.. కానీ ప్రశ్నలు మిగిలాయ్!
Follow Us On: X(Twitter)


