కలం/ఖమ్మం బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ఫలితాలు ఇంకా రాకముందే తాను ఇచ్చిన కుక్కర్లను వెనక్కి తీసుకున్నాడో అభ్యర్థి. ఈ విచిత్ర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Ashwaraopeta) లో జరిగింది. బుధవారం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే అనుమానంతో ఆ అభ్యర్థి ఈ పని చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేటలోని అల్లూరి సీతారామరాజు నగర్ 10వ వార్డులో కాంగ్రెస్ తరఫున మిండా హరిబాబు పోటీ చేశారు. ఓటర్లకు రూ.2,500 డబ్బుతోపాటు కుక్కర్లు పంచారు. అంతేకాదు, పోలింగ్ సమయంలో బూత్ లోపలికి వెళ్లడం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటివి చేశారు. దీంతో అదే వార్డు నుంచి పోటీ చేస్తున్న మరో అభ్యర్థి కరిష్మా.. హరిబాబు పంపకాలు, పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఈ వార్డు నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సంపంగి బరిలో ఉన్నారు (Ashwaraopeta). ఈయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. ఈ కారణంగా హరిబాబు కౌంటింగ్ కాక ముందే తాను గెలవలేనని నిర్దారణకు వచ్చారు. దాంతో తాను పంచిన కుక్కర్లు వెనక్కి ఇవ్వాలని గురువారం ఓటర్లను అడిగారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు గొడవకు దిగారు. మరికొందరు వెనక్కి ఇచ్చారు. మొత్తం మీద కుక్కర్లు పంచడం, తిరిగి అడగటం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
Read Also: టీ20 వరల్డ్ కప్: మెరిసిన ఇషాన్, హార్థిక్.. భారత్ ఘన విజయం
Follow Us On : WhatsApp


