కలం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భారత్ ఖాతాలోకి మరో విజయం చేరింది (India Vs Namibia). గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (61; 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా(52; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీలతో రాణించారు. సంజు శాంసన్(22; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), తిలక్ వర్మ(25; 21 బంతుల్లో 3 ఫోర్లు), శివమ్ దూబె(23; 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12; 13 బంతుల్లో 1 సిక్స్) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ప్రత్యర్థి బౌలర్లలో కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (4/20) భారత్‌ను దెబ్బతీశాడు. బెర్నార్డ్ స్కాల్జ్, జెజె స్మిత్, బెన్ షికోంగో తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదన ప్రారంభించిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయ్యింది (India Vs Namibia). ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్(29; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్, శివమ్ దూబె, జస్ర్పీత్ బుమ్రా తలో వికెట్ దక్కించుకున్నారు. హార్థిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఈ నెల 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
Read Also: అలానే ఆడండి.. భారత్‌కు మాజీ ప్లేయర్ సూచన
Follow Us On: Sharechat


