కలం, వెబ్ డెస్క్: ‘డబ్బు సంపాదించాలి’.. ఇది చాలా మంది కనే కల. ఇందుకోసం చాలా మంది ఇచ్చే సలహా (Business Lessons) బిజినెస్ చేయమని. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు దాకా పనిచేసే ఉద్యోగాలతో ప్రయోజనం ఉండదు. జీవితంలో బాగా ఎదగాలన్నా.. డబ్బు సంపాధించాలన్నా వ్యాపారంతోనే సాధ్యమని నమ్మేవాళ్లు ఎంతోమంది. వ్యాపారం అంటే లాభాలే అన్నట్లు చాలా మంది భావిస్తుంటారు. కానీ ఈ రంగంలో బిజినెస్ రేట్ తక్కువే ఉంది. ఎన్నో ఫెయిల్యూర్ స్టోరీలు ఉన్నాయి. ఒక్కోసారి వ్యాపారం కొట్టే దెబ్బకు జీవితాలే తలకిందులవుతాయి. అందుకే అనుభవం ఉన్నవారు మాత్రం వ్యాపారం మంచి ఆలోచనే.. కానీ అడుగు ఆచితూచి వేయాలని. సరైన ప్రణాళిక లేకపోతే భారీ నష్టాలు తప్పవు.
2025 నేర్పిన పాఠాలు ఇవే..
వ్యాపారరంగానికి సంబంధించి 2025వ సంవత్సరం మనకు పాఠాలు నేర్పింది. ఎన్నో అంచనాలతో స్టార్ట్ అయ్యి.. తీవ్రంగా విఫలమైన ఐడియాలతోనే (Business Lessons) ఈ పాఠాలను నేర్పుతుంది. ఇంతకీ ఆ బిజినెస్‌లు ఏంటి? నేర్పిన పాఠాలేంటో తెలుసా? టెక్నాలజీ, ట్రెండ్స్ ఉన్నాయన్న ఒక్క కారణంతోనే వ్యాపారం విజయవంతం అవుతుందని అనుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఏడాది స్పష్టంగా నిరూపించింది. కొత్తగా స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునేవారు, పెట్టుబడిదారులు ఈ వైఫల్యాల నుంచి తప్పక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కళ్లకు కట్టినట్లు చెప్పింది.
1. ఏఐ (AI) అంటే చాట్‌బాట్లే అనుకోవడం
2025లో ఏఐ ట్రెండ్‌ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వందలాది స్టార్టప్‌లు కేవలం చాట్‌బాట్లు, కంటెంట్ రైటింగ్ టూల్స్‌తో మార్కెట్లోకి వచ్చాయి. అయితే గూగుల్ జెమినీ(Gemini), చాట్ జీపీటీ(Chat gpt) వంటి ఉచితంగా లేదా తక్కువ ధరకు లభిస్తున్న శక్తివంతమైన టూల్స్ ముందు ఇవి నిలబడలేకపోయాయి. ప్రత్యేకత, స్పష్టమైన వినియోగ అవసరం (యూజ్‌కేస్) లేకపోవడంతో చాలా ఏఐ స్టార్టప్‌లు నష్టాల్లోకి వెళ్లాయి. టెక్నాలజీ కాదు… సమస్య, పరిష్కారం ముఖ్యం. ప్రజల నిజమైన సమస్యను పరిష్కరించే ఏఐ ఐడియాలే నిలబడతాయి.
2. అతిగా అంచనా వేసిన ‘క్విక్ కామర్స్’
10–15 నిమిషాల్లో డెలివరీ అనే కాన్సెప్ట్ మెట్రో నగరాల్లో కొంతవరకు విజయవంతమైనా, 2025లో దీన్ని టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరించడంలో అనేక కంపెనీలు విఫలమయ్యాయి. చిన్న పట్టణాల్లో ఇప్పటికీ ప్రజలు దగ్గరలోని కిరాణా దుకాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాకుండా అధిక డెలివరీ ఖర్చులు, లాజిస్టిక్స్ సమస్యలు చిన్న కంపెనీలకు భారంగా మారాయి. ఒక బిజినెస్ మోడల్ అన్ని ప్రాంతాలకు సరిపోదు. స్థానిక అవసరాలు, వినియోగదారుల అలవాట్లను అర్థం చేసుకోవడం అత్యంత కీలకం.
3. ఎలక్ట్రిక్ వాహనాల (EV) సర్వీస్ సెంటర్ల లోపాలు
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరిగినా, వాటి సర్వీసింగ్, బ్యాటరీ నిర్వహణపై సరైన నైపుణ్యం లేకపోవడం వల్ల అనేక ఈవీ సంబంధిత వ్యాపారాలు మూతపడ్డాయి. అమ్మకాలపై మాత్రమే దృష్టి పెట్టిన కంపెనీలు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను నిర్లక్ష్యం చేయడంతో వినియోగదారుల అసంతృప్తి పెరిగింది. ప్రముఖ కంపెనీల షేర్లు పడిపోవడం కూడా ఈ రంగంలో ఉన్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది. అమ్మకం ఎంత ముఖ్యమో, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా అంతే ముఖ్యం. దీర్ఘకాల నమ్మకమే వ్యాపారానికి బలం.
4. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌పై అతిగా ఆధారపడటం
కేవలం సోషల్ మీడియా సెలబ్రిటీలతో ప్రమోషన్లు చేస్తే చాలు బ్రాండ్ విజయవంతమవుతుందనే భావనతో ముందుకెళ్లిన అనేక కంపెనీలకు 2025లో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారులు ఇప్పుడు గ్లామర్ కంటే నాణ్యత, నిజమైన సమీక్షలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫేక్ హైప్‌తో మార్కెట్లోకి వచ్చిన బ్రాండ్లు త్వరగానే కనుమరుగయ్యాయి. మార్కెటింగ్ కంటే ప్రొడక్ట్ విలువ ముఖ్యం. కస్టమర్ నమ్మకం లేకపోతే ఏ బ్రాండ్ అయినా నిలబడదు.
ఏమి నేర్చుకోవాలి?
2025లో విఫలమైన ఈ బిజినెస్ ఐడియాల నుంచి ఒక విషయం స్పష్టమైంది. ట్రెండ్‌ను అనుసరించడం కాదు, ట్రెండ్‌కు విలువ జోడించడమే అసలు విజయ రహస్యం. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని వినూత్నంగా ఆలోచించాలి. ముఖ్యంగా వినియోగదారుల నిజమైన సమస్యలను పరిష్కరించే వ్యాపారాలే దీర్ఘకాలం నిలబడతాయి.
Read Also: ఈ ఐదు అలవాట్లతో ఒత్తిడికి గుడ్ బై చెప్పండి..!
Follow Us On: X(Twitter)


